TPT: వడమాలపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జడ్పీటీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. జడ్పీటీసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.