ఎన్టీఆర్: కంచికచర్లలోని చెవిటికల్లు సెంటర్, నెహ్రూ సెంటర్, జుజ్జూరు రోడ్డు సెంటర్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఆటోవాలాలు ఇష్టాను సారంగా రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనదారులు గందరగోళానికి గురవుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.