SS: రొద్దం మండలం తురకలపట్నం చెరువు వివాదంపై జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. మంత్రి సవిత తన అనుచరుల కోసం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో అధికారుల సమక్షంలో తురకలపట్నం ప్రజలకు దక్కిన చెరువు హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును తప్పుబట్టారు.