ప్రకాశం: త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయనున్న పదవ తరగతి విద్యార్థులకు మార్చి 3వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. 13వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాలన్నారు.