సత్యసాయి: ఈ నెల 9న ఉదయం 9:30 గంటలకు పుట్టపర్తి RDO కార్యాలయం వద్ద యూరియా, ఎరువుల కొరతపై YCP ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తెలిపారు. నల్లమాడ మండలంలోని నల్లసింగయ్యగారి పల్లెలో కార్యక్రమ పోస్టర్లు విడుదల చేశారు. రైతులు భారీగా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.