కడప: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు సినీ హబ్‌కు వెళ్లే మలుపులో లారీ ఢీకొని మైదుకూరు మండలం, ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీ కొందని స్థానికులు తెలపారు.
Tags :