ATP: అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలో రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు తాగునీటి ట్యాంకులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదురుగా, రామకృష్ణ కాలనీలో వీటిని ఏర్పాటు చేశారు. గత 20 నెలల్లో పంచాయతీలో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని తెలిపారు.