AKP: మునగపాక రైతు సేవా కేంద్రం వద్ద ఎరువులు కోసం రైతులు శుక్రవారం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఎరువులు పంపిణీ చేస్తారని తెలిసిన రైతులు ఉదయం ఏడు గంటలకే చేరుకున్నారు. రైతులు మధ్య తోపులాట కూడా జరిగింది. గంటలు తరబడి వేచి ఉన్న పలువురికి యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.