దేవదత్ పడిక్కల్ దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దీంతో అతనికి త్వరలోనే జాతీయ జట్టులో పిలుపువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో పడిక్కల్ సగటు, స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. ఇదే ఊపును కొనసాగిస్తే, రాబోయే సిరీస్‌లలో పడిక్కల్‌ను టీమిండియా జెర్సీలో చూడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.