RR: నూతనంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పడింది. పోలీస్ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ను త్వరలో రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ వెబ్సైట్ ద్వారా పోలీస్ అధికారుల వివరాలు, స్టేషన్ పరిధులు, ఫిర్యాదు నమోదు విధానం, అత్యవసర సంప్రదింపు నంబర్లు అందుబాటులోకి రానున్నాయి.