NLR: సంగం పట్టణంలోని స్థానిక శివాలయంలో శనివారం ఆరుద్ర నక్షత్రం, శివ ముక్కోటి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య అన్నాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.