NLR: చంద్రగ్రహణం సందర్భంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతం అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయాన్ని తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. భక్తులు ఆలయ నియమాలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.