ELR: భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 28వ తేదీన శుక్రవారం భీమడోలు, అంబరుపేట గ్రామాల లబ్ధిదారులకు చంద్రన్న స్వయం ఉపాధి సోపానం లోన్లకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామని ఎంపీడీవో పద్మావతిదేవి తెలిపారు. భీమడోలు మండలానికి సంబంధించి బీసీ, కాపు, ఈబీసీ కార్పొరేషన్‌కు సంబంధించి విడుదల చేసిన స్వయం ఉపాధి రుణాలకు 1,608 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.