TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమీక్షించారు. జాతరకు నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు.