Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉన్నాయి. ఈ రాజధాని విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారయణ తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడమే తమ పార్టీ విధానమని, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. పదేళ్లు పూర్తయ్యాక రాజధానిపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
పాలనా రాజధానిగా విశాఖను చేద్దామంటే అడ్డంకులు తప్పట్లేదు. ఉద్యోగుల బకాయిలపై మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వాలు ఎప్పుడూ బకాయిలు పెట్టలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని బొత్స తెలిపారు.