KRNL: వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-ఆటో ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.