NDL: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ABM పాలెంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరై పెన్షన్లు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కూటమి ముఖ్యం లక్ష్యమని అన్నారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకొని, పెన్షన్లు అందించారు.