ATP: కళ్యాణదుర్గంలో MLA అమిలినేని సురేంద్రబాబు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మహిళలు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేని నిరుపేదల కోసం ఈ సదావకాశం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.