AKP: వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలమంచిలి పట్టణ ఎస్సై సావిత్రి తెలిపారు. శుక్రవారం పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆటోలో దొంగతనాలపై ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోవాలన్నారు. బంధువుల ఇళ్లకు వెళ్తే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు.