కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రవేశపెట్టిన ‘స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్’ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్ట్‌కు గాను ఆయనకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. మార్చి 28న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ ప్రాజెక్ట్ మోడల్‌గా నిలిచింది.