ATP: జిల్లా SP జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం పోలీసు ఆసుపత్రిలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. కిమ్స్ సవేరా ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు చేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఎస్పీ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.