విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ వేడుకల్లో భాగంగా వెల్వడం గ్రామ కోమటి జయరామ్‌ను సంఘ సేవా రంగంలో నిరుపమాన కృషికి గాను కళారత్న పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించారు.