మన్యం: 2026-27 విద్యా సంవత్సరానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపాల్ వీర్ సింగ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు మే 9లోపు అలాట్మెంట్ లెటర్లో సూచించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి సీటు నిర్ధారించుకోవాలి. గడువులోగా సమర్పించకపోతే సీటు రద్దు అవుతుందని హెచ్చరించారు. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో ఉంటాయన్నారు.