PPM: రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం సాలూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు తెలియజేయగా, అప్పటికప్పుడు పరిష్కరించదగ్గ సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.మంత్రి గుమ్మడి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.