GNTR: కృష్ణానగర్ 1వ లైన్లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి 80వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం హయగ్రీవ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. విష్ణుసహస్రనామ పారాయణ, గరుడ వాహనంపై తిరువీధి ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.