ASR: మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అనంతగిరి మండలంలోని సందర్శన ప్రాంతమైన బొర్రా గుహాలు సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. మూడు రోజులుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బొర్రా గుహాలకు సందర్శకులు ఎవరు రావద్దని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా పర్యాటకశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.