KRNL: ద్వారక తిరుమల వేదికగా ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టు పాల్గొని 25 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర యోగ సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో సాధన చేసి పథకాల సాధించడం గర్వకారణమని తెలిపారు.