GNTR: మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియమితులైన ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆలయంలో మౌలిక సదుపాయాల విషయాలపై సూచనలు ఇచ్చారు.