కృష్ణా: నందివాడ మండలం తమ్మిరిశ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల నివారణ గురించి ఎస్సై సుబ్రహ్మణ్యం ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.