CTR: కుప్పం రెస్కో పరిధిలోని వినియోగదారులకు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అందుబాటులో ఉందని రెస్కో వైస్ ఛైర్మన్ విశ్వనాథ్ తెలిపారు. 31.01.2026 వరకు ఉన్న పాత బకాయిలకు వడ్డీ మాఫీ చేస్తున్నట్లు, మార్చ్ 10 నుంచి 25వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందన్నారు. గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.