NTR: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఉన్న శివాలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ నాగరాజు తెలిపారు. 11 రోజులు పార్వతి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. అలాగే, భక్తుల సహకారంతో అన్నదానం కూడా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.