కృష్ణా: అవనిగడ్డ శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఉగాది వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ – సాయి సుప్రియ దంపతులు, ఎమ్మెల్యే కుమార్తె శీలం కృష్ణప్రభ – అశ్విన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో యార్లగడ్డ శ్రీనివాసు వారిని సత్కరించారు.