కోనసీమ: మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన 26 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతరావు ఆధ్వర్యంలో ఆదివారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.