BPT: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని అధికారులకు సూచించారు. దొంగతనాలు, నేరాలు జరగకుండా రాత్రి వేళలో పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు ఉన్నారు.