NLR: వేసవిలో భూగర్భ జలాలు పడిపోతున్నా నెల్లూరులో ఇంకుడు గుంతలు, పంట కుంటల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాత బిల్లులు చెల్లించకపోవడంతో 80% పనులు నిలిచి పోయాయి. జిల్లాలో 8994 ఇంకుడు గుంతలకు గాను 5073 మాత్రమే పూర్తయ్యాయి. ‘పంట సంజీవని’ కింద 1641 కుంటలకు ఆదేశాలిస్తే కేవలం 230 పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు గడువు ముగుస్తున్నా అధికారులు లక్ష్యానికి ఆమడ దూరం ఉన్నారు.