NTR: విజయవాడలో నేటి నుంచి పబ్‌లపై నిఘా ఉంటుందని ఏసీపీ దామోదర్ రావు స్పష్టం చేశారు. పబ్‌లలో మైనర్లకి మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పబ్‌లపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరిపితే సహించేది లేదని పబ్ యాజమానులను హెచ్చరించారు.