VZM: ఈ నెల 30వ తేదీ ఉగాది రోజున విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పి4 కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనికోసం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన ఛాంబర్లో సమావేశామాయ్యారు.