ELR: కొయ్యలగూడెం మండలం రాజవరం పంచాయతీ గంగవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా మారింది. రహదారి గోతులమయంగా ఉండడంతో వర్షం పడిన సమయంలో దురద బురదగా తయారవుతుంది. దీంతో ద్విచక్ర వాహన దారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.