VSP: తల్లి తిట్టిందని మర్రిపాలెంకు చెందిన ఓ యువతి విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సముద్రంలోకి దూకే ముందు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించి బంధువులకు పంపింది. వీడియో చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. త్రీటౌన్ పోలీసులు సకాలంలో స్పందించి బీచ్‌కు చేరుకుని యువతిని రక్షించారు.