ప్రకాశం: యర్రగొండపాలెం మండలం నర్సాపాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 3వ విడత నగదు పంపిణి గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.