ప్రకాశం: మార్కాపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 2 ఇంటర్మీడియట్ కళాశాలల ఏర్పాటుకు సంబంధిత బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని మార్కాపురం ఆర్డీవో తెలిపారు. పెద్దారవీడు, పుల్లలచెరువు మండల కేంద్రంలో ఒక్కోటి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ మేరకు ప్రైవేట్ యాజమాన్యాలు ఆన్ లైన్లో దరఖాస్తు చేయవచ్చని కోరారు. పరిశీలించి, ఏర్పాటుకోసం బోర్డు అనుమతి ఇస్తుందన్నారు.