VSP: జీవీఎంసీ పరిధిలో ఇకపై జనన, మరణ ధ్రువపత్రాలు కేవలం జోనల్ కార్యాలయాల్లోనే CRS ద్వారా జారీ చేయనున్నట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి ఈ .ఎన్. వి. నరేష్ కుమార్ తెలిపారు. సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. యూబీడీ పోర్టల్ నిలిపివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.