Kodali Nani:దివంగత ఎన్టీఆర్ గురించి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (rajinikanth) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. చంద్రబాబును (chandrababu) చూసి ఎన్టీఆర్ (ntr) ఆత్మ సంతోషించి ఉంటుందని ఆయన అనగా.. వైసీపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి రోజా (roja) కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani) వంతు వచ్చింది. ఆ రోజు ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా.. వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు (chandrababu) మద్దతుగా నిలిచారని మండిపడ్డారు. ఇప్పుడు శతజయంతి వేడుకల్లో సిగ్గు, శరం లేకుండా చంద్రబాబును (chandrababu) ప్రశంసిస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలు నిర్వహించారని కొడాలి నాని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు రజనీకాంత్‌తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. దీంతో పవన్ కల్యాణ్ ఏదీ మంచి, ఏదీ చెడో గ్రహించాలని కొడాలి నాని కోరారు.
రజనీకాంత్‌కు (rajinikanth) ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని కొడాలి నాని అన్నారు. 3 రోజులు షూటింగ్ చేస్తే.. 4 రోజులు ఆస్పత్రిలో పడుకునే రజనీకాంత్ ఏం చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ వచ్చారని అడిగారు. ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలో రజనీకాంత్ ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలు పట్టించుకోరని కొడాలి నాని అన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో చంద్రబాబును (chandrababu) రజనీకాంత్ పొగిడారు. ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని అనడంతో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు విజనరీ అని.. సైబరాబాద్ చూసి ఇండియాలో ఉన్నానా..? న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతోందని చెప్పారు.