AP Budget బడ్జెట్ పై మేల్కొన్న ఏపీ ప్రభుత్వం.. 14 నుంచి సమావేశాలు
బడ్జెట్ రూపొందించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రం ఆదాయం అత్తెసరుగా వస్తోంది. ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ ఉంది. అన్ని మార్గాల ద్వారా అప్పులు తీసుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో అప్పుల (Debits) లెక్కలు ఎలా కనుమరుగు చేయాలనే దానిపై దృష్టి పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ (AP Budget Sessions) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం (Govt of AP) నిర్ణయించింది. వారం రోజుల పాటు సభ నిర్వహించాలని భావిస్తున్నది. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీ, సభ ఎన్ని రోజులు ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే తెలంగాణ (Telangana) మాదిరి కొద్ది రోజులే సమావేశాలు కొనసాగాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
కాగా ఈ సమావేశాలను ఈనెలాఖరు లేదా మార్చి (March) మొదటి వారంలో నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. కానీ అకస్మాత్తుగా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) వచ్చి పడ్డాయి. దీంతో సమావేశాలు దూరం జరిగాయి. ఎన్నికలు 13వ తేదీకి ముగుస్తుండడంతో ఆ తర్వాతి రోజు అంటే 13వ తేదీ నుంచి సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ కు సంబంధించిన కసరత్తు ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు. సూత్రప్రాయంగా బడ్జెట్ ప్రతిపాదనలు వాకబు చేసినట్టు కూడా తెలియడం లేదు.
వాస్తవంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ తమ బడ్జెట్ లను ప్రవేశపెట్టాయి. కానీ ఏపీ ప్రభుత్వంలో చలనం లేదు. అసలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ధ్యాసే లేదు. ఈ సమావేశాలను తేలికగా తీసుకుంది. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన బడ్జెట్ సమావేశాలను సీఎం జగన్ పెద్దగా దృష్టి సారించడం లేదు. ఎందుకంటే పాలన కంటే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. పరిపాలన వదిలేసి రాజకీయాలను తలకెత్తుకున్నారు. 175కు 175 సీట్లు అంటూ సాధ్యం కాని లక్ష్యాన్ని ముందుకు వేసుకుని పార్టీ నాయకులను పరుగులు పెట్టిస్తున్నాడు. ఎన్నికలకు ఇంకా దాదాపు 13 నెలలు సమయం ఉంది. కానీ రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమయ్యాడు. ఒక రకంగా ముందస్తుకు కూడా వెళ్తాడనే ప్రచారం జరిగింది. ఇంకా సమయం ఉంది. సీఎం జగన్ (CM YS Jagan Mohan Reddy) రాజకీయం కోసం ఎంతదాకైనా తెగిస్తాడు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి ప్రకటనలు చేస్తాడో వేచి చూడాలి.
కాగా బడ్జెట్ రూపొందించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రం ఆదాయం అత్తెసరుగా వస్తోంది. ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ ఉంది. అన్ని మార్గాల ద్వారా అప్పులు తీసుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ లో అప్పుల (Debits) లెక్కలు ఎలా కనుమరుగు చేయాలనే దానిపై దృష్టి పెట్టారు. బడ్జెట్ దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంచనాలు భారీగానే ఉంటున్నాయి. కానీ కేటాయింపులు సక్రమంగా ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ సారి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో రాజధాని విషయమై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.