CTR: ఎస్ఆర్ పురం మండలం పద్మాపురంలో నిర్వహించిన “పోలీసుల పల్లె నిద్ర” కార్యక్రమంలో ఎస్సై సుమన్ పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. యువత, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువులో ముందుకు సాగాలని సూచించారు. అల్లర్లు, రౌడీయిజం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.