CTR: పులిచెర్ల మండలం కల్లూరులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సర్పంచ్ షుకూర్ తన అనుచరులతో కలిసి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ గెలుపు కోసం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు