VZM: బొబ్బిలి మండలం జె.రంగరాయపురం గ్రామ రైతు వంగపండు రామారావు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు నాటుబండి పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన సోమవారం గ్రామ పెద్దలతో కలిసి వంగపండు రామారావును పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం తరఫున ఆర్ధిక సహాయం, పింఛన్ మంజూరు అయ్యేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.