ATP: ఎండల తీవ్రత దృష్ట్యా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. తాడిపత్రిలో విద్యార్థులు ఉదయం 7 గంటలకే పాఠశాలలకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహించి, అనంతరం భోజనం పెట్టి పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.