TPT: వాకాడు సబ్స్టేషన్ వద్ద ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఛైర్పర్సన్ వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి (రిటైర్డ్ జడ్జి) హాజరుకానున్నారు. వాకాడు, కోట, చెందోడు, చిట్టమూరు సెక్షన్ల వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందిచవచ్చని సిబ్బంది తెలిపారు.