PLD: మాచర్ల నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో ఆపదలో ఉన్న 53 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని వారికి సీఎం సహాయ నిధి కీలకంగా మారిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.